ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి.

ప్రజా పత్రిక పాలకొండ:ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం  ఏ. ఐ. కె. ఎస్. సి. సి. ఇచ్చినా పిలుపులో భాగంగా పాలకొండ మండలం కొండాపురం గ్రామం లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఆ ప్రతులను చూపుతూ రైతులు తమ నిరసన తెలిపారు .
     ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు  కిమిడి రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ  సరిగ్గా ఇదే రోజున గత సంవత్సరం  కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాల ఆర్డినెన్సును తీసుకు వచ్చిందని నిరసిస్తు దేశవ్యాప్తంగా రైతులు తమ నిరసన తెలియజేస్తున్న సందర్భంలో బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ రంగ సంస్థలను కాపాడుతూ రైతులను వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆవేదన వ్యక్త పరిచారు. అదాని ,అంబానీలకు అనుకూలమైన విధానాన్ని తీసుకురావడానికి కరోనా నేపథ్యంలో దొడ్డిదారిన గత సంవత్సరం ఆగస్టులో చట్టాలను చేసిందని గుర్తు చేశారు.
    జూన్ 5 నాకు చారిత్రక నేపథ్యం ఉందని  1974 ఇదేరోజున  అప్పటి కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా నిరంకుశ వైఖరి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ గారు రైతాంగ ఉద్యమానికి పిలుపునిచ్చారని గుర్తు చేశారు .
    సందర్భంలో  రైతు పక్షపాతి మాజీ ప్రధాని చరణ్ సింగ్ వర్ధంతి కూడా అనే తెలిపారు ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా రైతాంగ తన మనోభావాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ తమ నిరసన తెలియజేశారు . సంఘం నాయకులు బాల లక్ష్మణ్ నాయుడు వండాన కూర్మా రావు బాల గ దుర్గారావు (మాజీ ప్రెసిడెంట్ )లంక మోహన్ రావు, భూములు రమణ, మజ్జి సన్యాసినాయుడు, భూముల గంగరాజు, బచ్చల పారన్నాయుడు, బలగ దాలి నాయుడు ఇతరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments