ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

దళితులకు ఉచిత వైద్యం అందించాలి

ప్రజా పత్రిక:జలుమూరు మండలం తిమడాం గ్రామంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కులవివక్ష వ్యతిరేక  పోరాట సంఘం జిల్లా ఉపాద్యుక్షరాలు  లింగాల రాజేశ్వరి మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి అన్ని ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు, వైద్యం అందించాలని, ప్రతీ కుటుంబానికి కేరళ తరహాలో నిత్సావసర వస్తువులు ఇవ్వాలని,  ప్రతీ కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి రెండవ వే లో ఉపాధి కోల్పోయి  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నవారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ముందుకు రావాలని కోరారు.ఈ సమయంలో దళితులపై దుర్మార్గమైన దాడులు    జరుగుతున్నాయి.  దాడులకు పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, సబ్ ప్లాన్ నిధులు దళితులకు ఖర్చు చెయ్యాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో  జె.ప్రసాద్,యమ్. లక్ష్మణ్, బి.ప్రకాశ్, వి.భవాని తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments