ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు పంపిణీ

శ్రీకాకుళం:కరోనా కష్టకాలంలో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు స్కూలు ఉపాధ్యాయులకు టాటా స్కై జిల్లా సర్వీస్ ప్రొవైడర్ ఎం.వి.ఆర్ మూర్తి మరియు  జి. కాంతారావు, ఎస్ మోహనరావు మిత్ర బృందం సౌజన్యంతో నిత్యావసర సరుకుల కిట్లు ఇవ్వడాన్ని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు అభినందించారు. శ్రీకాకుళంలో ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న 25 మంది ఉపాధ్యాయులకు పది కేజీల బియ్యం, కిలో గోధమ నూక, ఒక కిలో గోధుమపిండి,  కిలో ఆయిల్ ప్యాకెట్ , కిలో కందిపప్పు చొప్పున అందజేశారు. కరోనా కాలంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులకు ఈ విధంగా నిత్యావసర సరుకుల అందచేయడం అభినందనీయమని గోవిందరావు కొనియాడారు. ప్రజల కష్టాల్లో భాగస్వామ్యం అవ్వడాన్ని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు స్కూలు ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టాటా స్కై సర్వీస్ ప్రొవైడర్ ఎం.వి.ఆర్ మూర్తి మాట్లాడుతూ గత కరోనా టైంలో కూడా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆహార పొట్లాలు అందజేశామని తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో ముందుంటామని అన్నారు.

Post a Comment

0 Comments