ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

మెగా రక్తదానం

*మెగా రక్తదానం*
👉మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలలో భాగంగా నిర్వహణ
👉ఎన్ జిఓ హోంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
👉రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
👉రక్తదానం చేసిన మెగా ఫ్యామిలీ అభిమానులు
👉రక్తం సేకరించిన శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ బృందం
👉విస్తృత ఏర్పాట్లు చేసిన అఖిల భారత చిరంజీవి యువత శ్రీకాకుళం జిల్లా నాయకులు
👉రక్తదాన శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను,
ఉత్తరాంద్ర కార్యదర్శి వైశ్యరాజు మోహన్ ,బహుజన నేత డా.కంఠ వేణు, వ్యాపారవేత్త బలభద్రుని రాజా, సీనియర్ జర్నలిస్ట్ సుధీర్ వర్మ,
న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠ, న్యూట్రిషన్ కోచ్ నాగరాజు తదితరులు
👉హాజరైన మెగా ఫ్యామిలీ హీరోల అభిమాన సంఘాల నాయకులు


శ్రీకాకుళం :

మెగా స్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీకాకుళంలో మెగా రక్తదానం శిబిరం నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత జిల్లా శాఖ ఆద్వర్యంలో శ్రీకాకుళంలోని ఎన్ జిఓ హోం వేదికగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసారు.ఈ శిబిరాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను,ఉత్తరాంద్ర కార్యదర్శి వైశ్యరాజు మోహన్ , బహుజన నేత డా.కంఠ వేణు, వ్యాపారవేత్త బలభద్రుని రాజా, సీనియర్ జర్నలిస్ట్ సుధీర్ వర్మ, న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠ,న్యూట్రిషన్ కోచ్ నాగరాజు లతో కలిసి ప్రారంభించారు. ఈ శిబిరంలో మెగా స్టార్ చిరంజీవి అభిమానులతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,ఐకానిక్ స్టార్ అల్లు అర్జున ,వరుణ్ తేజ్ ,సాయిధరమ్ తేజ్ అభిమానులు పాల్గొని రక్తదానం చేసారు. న్యూ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠ ఆద్వర్యంలోని బృందం రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు. ఈ మెగా రక్తదాన శిబిరం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో మెగా స్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడు ముందు ఉంటారన్నారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ద్వారా మెగా స్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాలను నిర్వహించి వాటిని తన అభిమానుల ద్వారా విస్తృత పరిచారన్నారు. రక్తదానం,నేత్రదానం కార్యక్రమాలను నిర్వహించి ఎంతో మందిని చిరంజీవి ఆదుకోగా ఆయన అభిమానులు ఇప్పుడు ఆ బాటలో నిలవడం అభినందనీయమన్నారు. మెగా స్టార్ చిరంజీవి,ఆయన ఫ్యామిలీ అభిమానులు నిస్వార్థంగా సేవలు అందిస్తూ ఇతరులకి స్పూర్తిగా నిలుస్తున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తైక్వాండో శ్రీను నాయకత్వంలో మెగా ఫ్యామిలీ హీరో అభిమానులు అంతా విరివిగా కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామమన్నారు. వారం రోజుల పాటు రోజుకి ఓ రకమైన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. స్వచ్చంధ సేవా కార్యక్రమంలో తనను భాగస్వామ్యులను చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అఖిలభారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను మాట్లాడుతూ మెగా స్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది వారం రోజుల పాటు జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగనే కార్యక్రమాలు జిల్లాలో నిర్వహిస్తున్నామన్నారు. మెగా స్టార్ చిరంజీవి ఇచ్చిన స్పూర్తితోనే ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. చిరంజీవి జన్మదినోత్సవం అంటే తమకి పండుగ అని అందుకే సేవా రంగంలో మెగా ఫ్యామిలీ అభిమానుల పేరు చిరస్థాయిగా నిలిచేలా కార్యక్రమాలను జరుపుతున్నామన్నారు. ఈ శిబిరంలో రక్తదానం చేసిన అభిమానులకి ,అత్యధిక సార్లు రక్తదానం చేసిన వారికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా జ్ఞాపికలను,ప్రశంసాపత్రాలను అందజేసారు. మెగా రక్తదాన శిబిరం ప్రారంభోత్సవానికి విచ్చేసిన గొండు శంకర్ కి మెగా అభిమానులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ బాలా నరసింహం,డాక్టర్ రాజశేఖర్ ,డాక్టర్ ప్రభు,డాక్టర్ రమణ ,సాయిబాబా, ఎన్ ఎస్ ఎస్ కో-ఆర్డినేటర్ నాగభూషణరావు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది శివ,సతీష్ , రామ్ చరణ్ యువ శక్తి జిల్లా అధ్యక్షులు మజ్జి గౌతమ్ , ఆలిండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా అద్యక్షుడు తైక్వాండో నవీన్ , గిరి, , పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు కిరణ్ కిర్రు, పెయ్యల చంటి, సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షుడు జోగిపాటి వంశీ , వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు శీర రాజు,చల్లా అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments