ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ కు బెస్ట్ టీచర్స్ అవార్డులు ఇవ్వాలి.స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గంగు మన్మధరావు.

శ్రీకాకుళం: ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ లో పనిచేస్తున్న ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ కు కూడా టీచర్స్ డే సందర్బంగా బెస్ట్ టీచర్స్ అవార్డులు ఇవ్వాలని ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గంగు మన్మధరావు కోరారు. ఈ మేరకు శ్రీకాకుళం నుండి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ లో అక్షరాస్యతలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ పాత్ర కీలకమన్నారు. గవర్నమెంట్ స్టూడెంట్స్ కన్నా.. గవర్నమెంట్ టీచర్స్, లెక్చరర్స్ కన్నా.. ప్రైవేట్ స్టూడెంట్స్.. ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అధికమన్నారు. కావున తమకు బెస్ట్ టీచర్స్ అవార్డులు ఇవ్వాలన్నారు. గవర్నమెంట్ టీచర్స్, లెక్చరర్స్ తో పాటు.. ప్రవేట్ టీచర్స్, లెక్చరర్స్ సమిష్టి కృషి ఉండటంతోనే విద్యావ్యవస్థలో సమూల మార్పులు వస్తున్నవిషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖా మంత్రి,విద్యా శాఖ కమీషనర్, అన్నీ స్థాయిల విద్యా శాఖ అధిధికారులు జోక్యం చేసుకుని.. ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ కృషిని గుర్తించి టీచర్స్ డే సందర్బంగా.. బెస్ట్ టీచర్స్ అవార్డులు ఇవ్వాలని జిల్లా అధ్యక్షులు నాగశివ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు కూడా ఆ ప్రకటనలో కోరారు.

Post a Comment

0 Comments