శ్రీకాకుళం, ఆగష్టు 19: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ(మీకోసం)లో అందిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి, మీకోసం అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు.
సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ(మీకోసం) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో పాటు జిల్లా రెవిన్యూ అధికారి అప్పారావు, ప్రత్యేక ఉపక్ కలక్టర్ రామ్మోహనరావు, డిఆర్డిఎ, పి.డి కిరణ్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులు ఆదేశించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీ దారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. పెండింగ్, బియాండ్ ఎస్ఎల్ఎ, రీ ఓపెనింగ్ లేకుండా అర్జిదారుడు సంతృప్తి చెందేలా అర్జీల పరిష్కర తీరు ఉండాలన్నారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్ మెంట్ ఇవ్వాలని తెలిపారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ(మీకోసం) కార్యక్రమంలో 130 అర్జీలు స్వీకరించడం జరిగింది.
ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వారికి అర్జీలు సమర్పించారు.
మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో కెఆర్సి ప్రత్యేక ఉప కలెక్టర్ సుదర్శనదొర, జెడ్పి సిఇఓ వెంకటేశ్వరరావు , జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి బి.మీనాక్షి, డ్వామా పి.డి చిట్టి రాజు, డిసిహెచ్ఎస్ డా.రాజ్యలక్ష్మి, ఇరిగేషన్ ఎస్.ఇ రాంబాబు, జిల్లా ఉద్యాన అధికారి ఆర్.వి ప్రసాద రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
0 Comments