ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

క్రీడలకు శ్రీకాకుళం జిల్లా పుట్టిన ఇల్లు.పౌర విమానయాన శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, ఆగష్టు 19: క్రీడలకు శ్రీకాకుళం జిల్లాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. 

11వ అంతర జిల్లా జూనియర్ సాఫ్టబాల్ ముగింపు సమావేశానికి ముఖ్య అతిధిగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు క్రీడాకారుల ఉద్దేశించి విజేతలకు అభినందనలు తెలుపుతూ జిల్లాలో అన్ని క్రీడలలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాలని, 2028 లో రాష్ట్రం లో జాతీయ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు, క్రీడాకారులకు రైల్వే శాఖ వారు ఇచ్చిన 75% రాయితీ తిరిగి పునరుద్దరణ కు కృషి చేస్తాని తెలియజేసారు,

ఈ కార్యక్రమం ఈరోజు ఇంత వైభవోపేతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న యువ క్రీడాకారులందరికి శుభాశీస్సులు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కి క్రీడలకు సంబంధించి ఒక చెరగని ముద్ర ఉందని మొట్టమొదటిసారిగా ప్రపంచ స్థాయిలో ఒలంపిక్ మెడల్ సాధించిన రణం కమల్లీశ్వరి, కోడి రామ్మూర్తి మరెన్నో ఉదాహరణలు చెప్పవచ్చు అన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు దాతల సహకారం ఎంతైనా అవసరం అన్నారు. ఒక మెరుగైన, ఆరోగ్యవంతమైన, భావితరాలకు ముందుకు నడిపించే ఆరోగ్యకరంగా ఉండాలంటే క్రీడల పాత్ర చాలా కీలకమన్నారు. నేటి యువతకి క్రీడల పై ఆసక్తి చూపేలా, మానసికంగా , శారీరకంగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.

స్థానిక శాశనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ కోడి రామ్మూర్తి స్టేడియం పునరుద్దరణ పనులు త్వరగా జరిగి క్రీడాకారులకు అందుబాటులోకీ తెస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ శ్రీధర్, పి.సుందర్ రావు, సాంబ మూర్తి,రాజు, ఎస్జిఎఫ్ కార్యదర్శి బి.వి రమణ,
ఎం.వి రమణ సాఫ్టబాల్ సంగం ప్రతినిధులు, కోచిస్, మేనేజర్స్, పిఇటీలు /పిడిలు, పలు జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments