నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న రెండు పోస్టులను అతిథి అధ్యాపకులచే భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ సురవరపు సత్యనారాయణ తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన అతిథి అధ్యాపకులుగా పనిచేయడానికి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపీ హెచ్ డబ్ల్యు, ఈఈటి కోర్సులలో ఒక్కొక్క ఖాళీలు ఉన్నాయన్నారు.
0 Comments