శ్రీకాకుళం:ఎస్ ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ప్రముఖ సామాజిక, పారిశ్రామిక వేత్త డాక్టర్ సూర శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు నగరంలో అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం పాతశ్రీకాకుళంలోని సంతోషిమాత ఆలయంలో సూర శ్రీనివాసరావు పుట్టినరోజును పురష్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బెహరామనోవికాస కేంద్రంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం తోటపాలెంలోని యూత్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి అభిమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటపాలెంలో ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని ఇక్కడ తాగునీటి ట్యాంకర్‌తో పాటు రచ్చబండలు నిర్మించానని, స్థానిక పాఠశాలలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. భవిష్యత్‌లో ఏ అవసరం ఉన్నా పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. నగరంలోని ఏడురోడ్ల జంక్షన్, డే అండ్ నైట్ కూడలి తదితర ప్రాంతాల్లో వందలాది మంది ఆటోడ్రైవర్లకు దుస్తులను పంపిణీ చేశారు. చిలకపాలెం జంక్షన్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి హాజరై పేదలకు స్వయంగా ఆహారాన్ని అందజేశారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని తన భవనం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా రక్త కొరత అధికంగా ఉందని యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సుమారు 3000 మంది మహిళలకు చీరెలు, టవళ్లను పంచి పెట్టారు. హయాతినగరం రెల్లివీధి యువత భారీ కేక్ కట్ చేసి సూర శ్రీనివాసరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజు సందర్బంగా శుబాకాంక్షలు తెలిపిన ప్రతీఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
0 Comments