

నరసన్నపేట పట్టణానికి చెందిన డా. వెంకట తులసీరామ్ పొన్నాడ కు ప్రతిష్టాత్మకమైన బిజినెస్ మింట్ నేషన్‌వైడ్ అవార్డ్స్ 2024 - మోస్ట్ ప్రొమినెంన్ట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ పురస్కారం తో సత్కరించబడ్డారని సగర్వంగా బిజినెస్ మింట్ నేషన్‌వైడ్ అవార్డ్ జ్యూరీ ప్రకటించిది. ఈ గౌరవప్రదమైన అవార్డ్ సేఫ్టీ-క్రిటికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్‌లలో డా. వెంకట తులసీరాము కనబరచిన అత్యుత్తమ రీసెర్చ్ మరియు ఇంప్లెమెంటెసన్ నైపుణ్యతకు గాను ప్రదానం చేశారు. డాక్టర్ వెంకట తులసీరాము ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజినీరింగ్‌లో పిహెచ్‌డి పూర్తి చేసారు, ప్రస్తుతం USAలో ప్రిన్సిపల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. అతను సేఫ్టీ-క్రిటికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్‌లలో పలు ప్రసిద్ధ పరిశోధన పత్రాలు, బుక్ చాఫ్టర్లు ప్రచురించారు మరియు క్లినిషియన్ డెసిషన్-సపోర్ట్ సిస్టమ్స్‌కు సంబంధించి రెండు పేటెంట్‌లను దాఖలు చేశారు. అతను IEEE మరియు ACM లలో చురుకుగా పాల్గొన్నారు, IEEE సీనియర్ సభ్యునిగా మరియు ఇంజనీరింగ్ రీసెర్చ్ కౌన్సిల్ యొక్క ఫెలోగా గుర్తింపు పొందారు. అతను అనేక అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లలో ప్రధాన వక్తగా, థీసిస్ అడ్జుడికేటర్గా, పీర్ రివ్యూయర్‌గా పనిచేశారు. ఈ అవార్డ్ రావడం పట్ల స్నేహితులు, ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.
0 Comments