నరసన్నపేట:నరసన్నపేట జ్ఞానజ్యోతి డిగ్రీ కళాశాల ఆవరణలో రేపు డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఆదేశాల మేరకు రేపు శనివారం ఇంటర్ ఉత్తీర్ణత పొందిన నాన్ ఎంపీసీ గ్రూపు విద్యార్థులకు హెచ్సీఎల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జాబ్ మేళా ను నిర్వహించనున్నట్లు ఆర్.ఐ.ఓ దుర్గారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ అర్హతతో ఐటీ పరిశ్రమల్లో చేరేందుకు 75 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించినవారు అర్హులని పేర్కొన్నారు. ఉత్సాహవంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు నరసన్నపేట పట్టణంలోని జ్ఞానజ్యోతి డిగ్రీ కళాశాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు._*
0 Comments