టెక్కలి, ఆగస్టు 23 :టెక్కలి పట్టణంలో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం సాయంత్రం సుడిగాలి పర్యటన చేశారు. ద్విచక్ర వాహనంపై స్థానిక ప్రజలతో కలిసి అయ్యప్ప నగర్, మందాపొలం, భవానీ నగర్ కాలనీల్లో ప్రజలతో కలసి కలియ తిరిగారు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పట్టుమహాదేవి కోనేరు సుందరీకరణ చేసి ఆహ్లాదకరంగా మార్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అప్పటికప్పుడే స్థానిక అధికారులకు ఆయన ఆదేశించారు. కాలనీల్లో ప్రజల నివాసాల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
డ్రెయిన్ సమస్యలు, రహదారి సమస్యలు, భూముల ఆక్రమణలు తదితర అంశాలపై సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఆయన పర్యటనలో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వాములు అయ్యారు. ప్రజా సమస్యలు పరిష్కారమే పరమావధిగా పనిచేయాలని సూచించారు.
0 Comments