ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

గ్రామాలకు మళ్లీ స్వర్ణయుగం: ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

సారవకోట: బుడితి గ్రామసభలో పాల్గొని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభ కార్యక్రమం ద్వారా ఊరు బాగు కోసం 87 రకాల పనులతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాలు,నీటి సంరక్షణ వ్యవసాయ అనుసంధాన పనులు చేపట్టి గత ఐదేళ్లుగా వైసిపి ప్రభుత్వం హయాంలో కుప్పకూలిన పంచాయతీ రాజ్ వ్యవస్థకు జవసత్వాలు నింపి మన గ్రామాలను మనమే పరిపాలించుకునేలాగా పారదర్శక, జవాబుదారి పాలనకు నిదర్శనంగా కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో సారవకోట ఎంపిడిఓ గారు,జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ బలగ ప్రవీణ్ కుమార్ గారు,మండల పరిషత్ అధ్యక్షులు చిన్నాల కూర్మినాయుడు గారు,రాష్ట్ర బి.సి.సెల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్ గారు, స్థానిక సర్పంచ్ పొన్నాన శంకరరావు గారు, ఎంపీటీసీ సభ్యులు మెండ మురళి కృష్ణ గారు,పోన్నాన సీతారామనాయుడు గారు, సారవకోట రామారావు గారు,నిక్కు రామారావు మరియు అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments