ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

వాక్ ఇన్ ఇంటర్వ్యూ

శ్రీకాకుళం, ఆగష్టు 21: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో  2022/2023/2024 సం. లో ఏదైనా డిగ్రీ/బి.టెక్ లేదా పీజీ పూర్తి చేసుకుని ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా జెన్పాక్ట్ సంస్థ తో  "వాక్ ఇన్ ఇంటర్వ్యూ " కార్యక్రమం నిర్వహించబడును. జెన్పాక్ట్ సంస్థ కంటెంట్ మోడరేషన్ మరియు కస్టమర్ సర్వీస్-వాయిస్ సపోర్ట్ విభాగాలలో ఉద్యోగాలు భర్తీ చేయుటకు గాను ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది కావున అర్హత, ఆసక్తి మరియు ఇంగ్లీష్ భాషా నైపుణ్యం కలిగి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు  హెచ్ఆర్ రౌండ్ మరియు టెక్నికల్ రౌండ్  ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.  కావున పై అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ రిజిస్ట్రేషన్ లింక్ https://bit.ly/46Wzqz6  నందు రిజిస్టర్ అవ్వగలరు మరియు skilluniverse.apssdc.in వెబ్ సైట్ ను సందర్శించగలరు మరిన్ని వివరాలకు 9988853335, 9550967353, 9704960160 నెంబర్లను సంప్రదించగలరు. రిజిస్ట్రేషన్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ మరియు ఇంటర్వ్యూ వేదిక వివరాలు ఇమెయిల్ ద్వారా లేదా మెసేజ్ ద్వారా తెలియజేయబడునని శ్రీకాకుళం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.బి.సాయి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

Post a Comment

0 Comments