శ్రీకాకుళం,సెప్టెంబర్,17: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.O కార్యక్రమాన్ని వర్చ్యువల్ విధానంలో ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో లబ్దిపొందిన లబ్ధిదారులకు గృహ ప్రవేశాలకు సంబంధించి తాళాలు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో పాటు శాసన సభ్యులు గొండు శంకర్, ఎన్. ఈశ్వరరావు లు జిల్లాలోని 20 మంది లబ్ధిదారులకు గృహ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గృహనిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. లబ్దిదారులకు ఇసుక, సిమెంటు సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల శాసన సభ్యులు గొండు శంకర్, ఎన్. ఈశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ పిడి నగేష్, డిఈ, ఎఈలు, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments