శ్రీకాకుళం, సెప్టెంబర్ 17: విశ్వకర్మ పూజ అనేది హిందూ సమాజంలోని ప్రజలకు చాలా ముఖ్యమైనది. భగవంతుడు విశ్వకర్మ రచనలు రుగ్వేదం, స్థాపత్య వేదాలలో ప్రస్తావించబడ్డాయి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
విశ్వకర్మ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సందర్భంగా మంగళవారం ఉదయం కలెక్టరెట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తో కలసి విశ్వకర్మ చిత్ర పఠానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హిందూ పురాణాల ప్రకరం రుగ్వేదంలో, క్రిష్ణ యజుర్వేదంలో సృష్టికర్తగా విశ్వకర్మను పరిగణిస్తారన్నారు.
కార్యక్రమంలో శాసన సభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ విశ్వకర్మ పూజ అనేది హిందూ సమాజంలోని ప్రజలకు చాలా ముఖ్యమైనది. భగవంతుడు విశ్వకర్మ రచనలు రుగ్వేదం, స్థాపత్య వేదాలలో ప్రస్తావించబడ్డాయి. వాస్తు శాస్త్రం మరియు యాంత్రిక శాస్త్రం గురించి అనేక విషయాలున్నాయి. విశ్వకర్మ పూజ విజయవంతం కావాలని.. ఆ దేవుని ఆశీస్సులు లభించాలని.. కుటుంభాలు ఆయురారోగ్యాలతో అనునిత్యం ఆనందంగా ఉండాలన్నారు. పని చేసే వారితో పాటు హస్తకళాకారులు విశ్వకర్మ పూజలో భాగంగా తమ పనిముట్లను ఆరాదీస్తారాన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఇ. అనురాధ, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, జిల్లా విశ్వ బ్రాహ్మణ జిల్లా వెల్ఫేర్ సంగమ్ అధ్యక్షులు ధనుంజయ ఆచారి, గణపతి,వీరాస్వామి, హరినాథ్ తదితర కమ్యూనిటీ సభ్యులు, కలెక్టరేట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments