ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

పరిశుభ్రత.. అందరి బాధ్యత..చీపురు పట్టిన కేంద్ర మంత్రి

శ్రీకాకుళం, సెప్టెంబర్ 17 :తడి చెత్త, పొడి చెత్తను ఇళ్ల లోనే వేరు చేయడం ద్వారా అపరిశుభ్రత సమస్యను చాలా వరకు పరిష్కరించవచ్చని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన ఏపిహెచ్బి కాలనీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలసి పాల్గొన్నారు. ప్రతి ఇంటి పరిసరాలను శుభ్రంగాjj ఉంచుకోవడం ద్వారా వ్యాధులు సంక్రమించకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని సూచించారు. అప్పుడే స్వచ్ఛ శ్రీకాకుళం ఆశయ సాధనతో పాటు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ లక్ష్యాలను సాధించవచ్చని హితవు పలికారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, శ్రీకాకుళాన్ని రాష్ట్రంలోనే స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో ప్రజలు కూడా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులు, మహిళలు మానవహారంగా ఏర్పడి, స్వచ్ఛత ప్రాధాన్యతపై నినాదాలు చేశారు. అలాగే ఏపీహెచ్ బీ పార్క్ వద్ద జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి.. స్వయంగా చీపురుపట్టి పార్కును శుభ్రం చేశారు.

Post a Comment

0 Comments