శ్రీకాకుళం, సెప్టెంబర్ 17: పిల్లలందరూ నులిపురుగులు నిర్మూలనకు మాత్రలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు.
మంగళవారం పి.ఎస్.ఎన్.యమ్.హెచ్.స్కూల్ లో ఏర్పాటు చేసిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, శ్రీకాకుళం శాసనసభ్యులతో కలసి విద్యార్థినీ, విద్యార్థులకు నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాతూ 2-19 సంవత్సరాల వయసు లోపల ఉన్న విద్యార్థులందరు ఒక ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవాలని చెప్పారు. ఈ మాత్రలు వలన ఏ విధమైన ఇబ్బందులు ఉండవని, ఏ విధమైన ఇబ్బందులు తలెత్తినా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. విద్యార్థులు ఎవరైనా స్కూల్ కి రాకపోతే వారికి మాత్రలు పంపిణీ చేయాలని విద్యార్థులకు తెలిపారు.
జిల్లాలో 4 లక్షల 70 వేల మంది పిల్లలు ఉన్నట్టు చెప్పారు. పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలన్నారు. నులిపురుగులు సోకిన పిల్లలు, కిశోర బాలలు ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోకుండా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని, నులిపురుగుల వలన రక్త హీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటివి ఉంటాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎండలు అధికంగా ఉంటాయని అందరు తరచూ మంచినీరు త్రాగాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య, శాఖాధికారిణి డాక్టర్ మీనాక్షి, జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య, జిల్లా కోర్డినేటర్ డాక్టర్ వెంకట్, డి.పి.ఎం.ఓ.జి వి.లక్ష్మీ, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వరులు, ప్రోగ్రాం మేనేజర్ దోమ అప్పలనాయుడు, హెల్త్ ఎడ్యుకేటర్ మోహిని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments