శ్రీకాకుళం జిల్లాలో కొన్ని చోట్ల చనిపోయిన తర్వాత కూడా కొందరికీ కష్టాలు తప్పడం లేదు. జలుమూరు మండలం తలతరియా పంచాయతీ లింగాలవలసలో సోమవారం వెలుగు చూసిన ఘటనే ఇందుకు నిదర్శనం. స్థానిక గ్రామంలోని దళితుల శ్మశానానికి సరైన దారి లేదు. ఈక్రమంలో నడుము లోతు నీటిలో చిన్న గట్టు వెంబడి మృతదేహాన్ని ఇలా తరలించారు. పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ రహదారి సౌకర్యం కల్పించలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమ గ్రామం నుంచి స్మశానానికి వెళ్లే రహదారిని ఏర్పాటు చేయాలని కోరుచున్నారు.
0 Comments