జలుమూరు: మండలంలోని తిమడాంలో 90 ఏళ్లుగా నివాసం ఉంటోన్న ఓ పేద కుటుంబంపై గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జులుం ప్రదర్శిస్తున్నారు.90 ఏళ్లుగా ఆ కుటుంబం ఇక్కడే నివసిస్తుండగా.. వైసిపి హయాంలో పట్టా ఇచ్చారు.ఆర్థిక స్థోమత లేక వారు ఇల్లు కట్టుకోలేకపోయారు. మట్టి గోడలతో చిన్నపాటి ఇల్లు కట్టుకొని ఇంటి ముందు టిఫిన్ బండి పెట్టి జీవనం సాగిస్తున్నారు. వీరు వైసిపికి అనుకూలంగా ఉన్నారనే అనుమానంతో కొందరు టీడీపీ నాయకులు పట్టాను మాయం చేసి పోలీసులతో వేధిస్తున్నారన్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఇంటిలో గొడెయ అమ్మన్న, కృష్ణమూర్తి టిఫిన్ విక్రయిస్తూ జీవిస్తున్నారు. కొన్నేళ్ల కిందట కృష్ణమూర్తి మృతి చెందాడు. 25 రోజుల కిందట అమ్మన్న కూడా చనిపోయారు. దీంతో టీడీపీ పెద్దల కళ్లు ఆ ఇంటిపై పడ్డాయి. అమ్మన్న మృతిని సాకుగా తీసుకుని ఆ పేద కుటుంబంపై టీడీపీ పెద్దలు తమ ప్రతాపం చూపుతున్నారు. అమ్మన్న బతికి ఉన్నప్పుడే కుమార్తె రమణమ్మ, అల్లుడు బాబూరావు ఇక్కడే టిఫిన్ షాపు పెట్టారు. ఇప్పుడు ఇంటి స్థలం తమదే అంటూ టీడీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని వారు వాపోతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా సైతం తీసుకొని ఇప్పుడు అది జిరాయితీ స్థలం అని బెదిరిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించామని అయినా బెదిరింపులు మానడం లేదని అంటున్నారు. దీనిపై జలుమూరు ఎస్ఐ బి. అశోక్ బాబు మాట్లాడుతూ కేసు కోర్టులో ఉన్నందున దీనిపై మాట్లాడకూడదని వారిని పిలిపించి చెప్పామన్నారు.
0 Comments