ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

విద్యార్థులు ఉత్తమ లక్ష్యాలను అలవర్చుకోవాలి.

నరసన్నపేట:విద్యార్థులకు క్రమశిక్షణ ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ఉత్తమ లక్ష్యాలు ఏర్పర్చుకోవాలని విశ్రాంత ఆస్ఐఓ రుక్మాంగధరరావు అన్నారు. నరసన్నపేట మండలం కేంద్రంలోని జ్ఞానజ్యోతి డిగ్రీ కళాశాలలో బుధవారం ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. ప్రధాన వక్తగా వచ్చిన ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరము ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ దాలినాయుడు మాట్లాడుతూ డిగ్రీ విద్యార్థులు స్కూల్ పిల్లలకు ఆదర్శంగా ఉండాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సినిమా గీతాలకు నృత్యాలు చేసి సందడి చేశారు. కళాశాల యాజమాన్య ప్రతినిధులు రమణయ్య, ప్రిన్సిపాల్ కృష్ణారావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments