ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత

సారవకోట మండలం కిన్నెరవాడ గ్రామంలో వెలిసిన ప్రముఖ దివ్యక్షేత్రం  శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని ప్రధాన అర్చకులు సిద్దయ్య స్వామీజీ తెలిపారు.అలాగే గ్రామస్తులచే.. గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. గోమాతకు పూజిస్తే సర్వదేవతలకు పూజించినట్లే అని అవగాహన కల్పించామన్నారు. భక్తులకు ప్రజలకు నారాయణ సేవ అన్నదాన కార్యక్రమాన్ని సర్పంచ్ పంచరెడ్డి పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించి అన్న ప్రసాదాన్ని వితరణ చేసామన్నారు

బోర గోవిందరావు, హేమలత దంపతులు, బండి బారికివాడు, శిమ్మమ్మ దంపతులు, చల్ల గోవిందరావు, చిన్నమ్మడు (యర్రయ్య) దంపతులు, మట్ట లచ్చుమయ్య, నారాయణ, జోగులమ్మ, సుధీర్ ,చిట్టి ఆదెమ్మ కుమారుడు : రామక్రిష్ణ, కింజరావు ముసలయ్య, సరోజనమ్మ దంవుతులు, 
శిమ్మ దాలప్పన్న మనుమడు : తేజేశ్వరరావు, అనుపోజు లోకేష్ విజయకుమార్, శ్రీమతి శరణ్య దంపతులు అరవింద్ హాస్పిటల్, నరసన్నపేట, పైడిశెట్టి వెంకట రమణ, పుణ్యవతి దంపతులు,సత్యసాయిబాబా జిల్లా... ఇన్.... కొమనాపల్లి మొదలగువారు నారాయణ సేవ (అన్నదానం) నకు ఆర్థిక సహకారము అందించారని తెలిపారు.

ప్రవచనకారులు శ్రీమత్ భగవద్గీత పారాయణ ప్రచారకులు, ఆధ్యాత్మిక వేత్త కంచుమోజు రామ్మోహన్ మాస్టర్ సారధ్యంలో ఆధ్యాత్మిక సత్సంగ సమావేశం నిర్వహించామని తెలిపారు. పార్వతీపురం, మన్యంజిల్లా సమరత సేవా ఫౌండేషన్ కన్వీనర్ దాశరెడ్డి యోగీశ్వరరావు ముఖ్య అతిథిగా మాట్లాడారని తెలిపారు. ఆధ్యాత్మికవేత్త గొలివి మోహనరావు మాస్టర్ గౌరవ అతిథిగా పాల్గొని మాట్లాడారన్నారు.ప్రముఖ జోష్యులు బోయిన వెంకట రమణ మాట్లాడి ఆధ్యాత్మికత గురించి జ్యోతిష్యం గురించి తెలిపారని చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనలో ఉండాలని కోరారు ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంచ రెడ్డి పద్మావతి, జిల్లా లోని అన్ని మండలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.

Post a Comment

0 Comments