జలుమూరు:స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా జలుమూరు మండలం శ్రీముఖలింగంలోని ఆలయాన్ని EO ప్రభాకరరావు అర్చకులు, సిబ్బంది కలిసి మంగళవారం శుభ్రం చేశారు. దేవాలయం బయట, లోపల ఎక్కడా చెత్త లేకుండా క్లీన్ చేశారు. పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలమని అర్చకులు చెప్పారు. అందరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
0 Comments