ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

పరిసరాల పరిశుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యం: పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి

పోలాకి మండలం ఈదులువలస గ్రామంలో శుక్రవారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు నిర్వహించామని పంచాయతీ కార్యదర్శి బోర ధనలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలను నాటాలని కోరారు మొక్కలు ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ వాయువు వస్తుందని తద్వారా మనమంతా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు బొమ్మాలి బలరాం, అంబటి రమణయ్య, చల్ల బుజ్జి, దుర్రు లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గ్రామస్తులందరూ తమ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనమందరము కూడా ఆరోగ్యంగా ఉంటామని అవగాహన కల్పించారు. అలాగే గ్రామంలోని ఖాళీ సలాలలో పచ్చని మొక్కలను నాటాలని కోరారు. ఈ పచ్చని మొక్కలు వల్ల ప్రజలకు అవసరమయ్యే స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుందన్నారు తద్వారా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని మనం గడపువచ్చని ప్రజలకు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

Post a Comment

0 Comments