ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

అంతర్జాతీయ పోటీలకు జమ్ము విద్యార్థులు

నరసన్నపేట: అంతర్జాతీయ స్థాయిలో ఈజిప్ట్ లో అక్టోబర్ 10 నుంచి 13 వ తేదీ వరకూ జరగనున్న ఈత పోటీల్లో నరసన్నపేట మండలం జమ్ముకు చెందిన టెంక ప్రేమకుమార్ అండర్-17 బాలుర విబాగంలో పాల్గొననున్నాడు. ఈ మేరకు ప్రవీణకు ఏపీ ఈత ఫెడరేషన్ అసోసియేషన్ నుంచి సమాచారం వచ్చింది. ప్రస్తుతం యానాం సాయి అకాడమీలో ఈత పోటీలపై ప్రవీణ్ శిక్షణ పొందుతున్నారు. పాస్పోర్టు పనిపై జమ్ము వచ్చిన ఈయనకు నరసన్నపేట YMCA ప్రధాన కార్యదర్శి గొద్దు చిట్టిబాబు, క్రికెట్ సబ్ సెంటర్ కోచ్ కుప్పిలి శ్రీను లు అభినందించారు. పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన స్విమ్మింగ్ డ్రస్, షూస్ (కిట్) చిట్టిబాబు వితరణ చేశారు. ఈ పోటీల్లో ప్రవీణ మంచి ప్రతిభ చూపాలని ఆయన ఆకాంక్షించారు.

Post a Comment

0 Comments