ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

పాఠశాల సముదాయాలు విజ్ఞానాన్ని పంచుకునే వేదికలు.

పాఠశాల సముదాయాలు విజ్ఞానాన్ని పంచుకునే వేదికలు.
బోరుభద్ర స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ పి.రామకృష్ణ.

బోరుభద్ర(సంతబొమ్మాలి): సంతబొమ్మాలి, కోటబొమ్మాలి మండలాలకు చెందిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల పాఠశాల సముదాయ సమావేశం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,బోరుభద్ర లో సముదాయ కార్యదర్శి బాడాన రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల సముదాయ చైర్మన్ పి.రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ విజ్ఞానం ను పంచుకునే అద్భుత వేదిక పాఠశాల సముదాయ సమావేశాలని,వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు సమ సమాజ నిర్మాతలని, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యత వారి భుజస్కంధాలపై ఉందని అన్నారు.పాఠశాల సముదాయ కార్యదర్శి బాడాన రాజు మాట్లాడుతూ సామాజిక స్పృహ, నైతిక విలువలను జోడించి పాఠాలతో పాటు జీవిత పాఠాలు బోధించి విద్యార్థుల మనసులను గెలుచుకొనే ఛాంపియన్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడని అన్నారు. ఆధునిక బోధనా పద్ధతుల ద్వారా సాంకేతికత ను జోడించి ప్రతి ఉపాధ్యాయుడు బోధించాలని రాజు సూచించారు. ఏపిటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని కోరారు. వినూత్న బోధనా పద్ధతులను ఉపాధ్యాయులు కె.తవిటి రెడ్డి, విష్ణు, చందన రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సముదాయ చైర్మన్ పి.రామకృష్ణ, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాడాన రాజు,ఏపిటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి, ఉపాధ్యాయులు కె.తవిటిరెడ్డి, టి.చందన రావు,ఆట్ల విష్ణు, కె.లక్ష్మీనారాయణ, సామ సంజీవరావు, బి.పాపారావు, జనార్ధన రావు, తిరుమల రావు,మీనా, శివజ్యోతి, అరుణ కుమారి, మరియు రెండు మండలాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments