నరసన్నపేట పట్టణంలోని జగన్నాధపురంలో నివాసం ఉంటున్న కోరాడ సర్వేశ్వరరావు కుమార్తె లిల్లి (22) ఈనెల 15న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని తండ్రి నరసన్నపేట పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. 15వ తేదీ నుంచి అన్ని ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఆమె ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. దీంతో SI దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
0 Comments