ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

మన భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలి: కేంద్రమంత్రి

శ్రీకాకుళం, సెప్టెంబర్ 17: మన భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలి అందుకు శ్రీకాకుళం నుండే శ్రీకారం చుట్టాలన్నారు. “స్వచ్ఛ భారత్ దివస్” కార్యక్రమంలో స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అను నినాదంతో నిర్వహించడం జరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.

మంగళవారం ఉదయం మునిసిపల్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తో కలసి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు మాట్లాడుతూ ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు అని ఆయన అడుగుజాడలలో భారతదేశం అభివృద్ధి చెందుతుందని అభివృద్ధితోపాటు పరిశుభ్రత పై అవగాహన పెంపొందించుకోవాలని 10 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని స్వచ్ఛత వైపు తీసుకువెళ్లాలని మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. దేశమంతా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశ్యంతో 14 రోజులపాటు స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ 14 రోజులు పాటు మనం చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. దేశంలోనే భారతదేశం అగ్రస్థానం సాధించాలని అందుకు శ్రీకాకుళం నుండి శ్రీకారం చుట్టాలన్నారు.

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం "స్వచ్ఛతా హీ సేవ” కార్యక్రమము 14 సెప్టెంబర్ నుండి 01 అక్టోబర్ వరకు “స్వభావ్ స్వచ్ఛతా - సంస్కార్ స్వచ్ఛత” అను ఇతివృత్తము ద్వారా నిర్వహించుకొనుచున్నామన్నారు. స్వచ్ఛత పట్ల మన స్వభవంలోనూ, సంస్కారం లోనూ మార్పు రావాలన్నారు. ఈ కార్యక్రమం 3 ముఖ్యమైన అంశముల ప్రాతిపదికన నిర్వహించబడుతోందని పేర్కొన్నారు. ఆ మూడు అంశాల్లో “స్వచ్ఛతా కి భాగీదారీ” ఒకటని, ఇందులో ప్రజల భాగస్వామ్యం, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో స్వచ్చత కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. "సంపూర్ణ స్వచ్ఛత" రెండవదని, దీనితోబాటు “స్వచ్ఛతా లక్షిత్ ఎకాయి” క్లీన్లినెస్ టార్గెట్ యూనిట్స్"(CTU) బ్లాక్ స్పాట్స్, ఇందులో మెగా శుభ్రత కార్యక్రమము ప్రజల భాగస్వామ్యం తో శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. “సఫాయి మిత్రా సురక్ష శివిర్” మూడవదని, ఇందులో సఫాయి మిత్ర, క్లాప్ మిత్ర, శానిటేషన్ వర్కర్లకు హెల్త్ చెకప్ లు మరియు వారికి వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు వారిని సత్కరించటం ఉంటాయన్నారు.

కావున ప్రజలు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువతీ యువకులు, స్వచ్ఛంద సంస్థలు, సీనియర్ సిటిజన్స్, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార సంస్థలు ఈ కార్యక్రమములో భాగస్వామ్యం కావాలని, స్వచ్ఛ శ్రీకాకుళం జిల్లాగా స్వచ్ఛ గ్రామాలు, వార్డులుగా రూపుదిద్దుటకు సహకారాన్ని అందించాలని కోరారు. ఈ 15 రోజులలో మన గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా చేసి దేశ స్థాయిలో గుర్తింపు మరియు అవార్డులు తీసుకొని రావడంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగస్తులు కలిసికట్టుగా పాల్గొని స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని ఆయా మండలాల్లో విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్నీ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొనాలని సూచించారు.

కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ పారిశుధ్యం ప్రతి ఒక్కరి బాధ్యత అని అందరి సహకారంతోనే అది సుసాధ్యమని ఇటువంటి కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువతీ యువకులు, స్వచ్ఛంద సంస్థలు, సీనియర్ సిటిజన్స్, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార సంస్థలు భాగస్వామ్యం కావాలన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ముఖ్య అతిథులు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ దుస్తులు అందజేశారు. అక్కడ నుండి బయలుదేరి హెచ్ బి కాలనీ వెనుక వైపు పార్కులో స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా. బి. మీనాక్షి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు, మున్సిపల్ కార్యాలయ అధికారులు సిబ్బంది. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగస్తులు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments