ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

పోగొట్టుకున్న 154 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేసిన SP మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం అక్టోబరు 26. గత రెండు నెలల వ్యవధిలో జిల్లాల్లో పోగొట్టుకున్న 154 మొబైల్ ఫోన్లు జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు శనివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పత్రిక సమావేశం నిర్వహించి పాత్రికేయులతో మాట్లాడుతూ...ఎవరైతే వారి యొక్క ఫోన్లను పోగొట్టుకున్నారో వాళ్ళు CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా ceir.gov.in అనే పబ్లిక్ వెబ్ సైట్ లో ఫోన్ ను తిరిగి పొందుటకు గాను బ్లాకింగ్ రిక్వెస్ట్ ను రిజిస్టర్ చేసుకోవాలి అని తెలిపారు.ఇలా వచ్చిన ఫిర్యాదులు మేరకు గత రెండు నెలల వ్యవధిలో 154 ఫోన్ లు రికవరీ చేయడం జరిగింది. వాటి యొక్క విలువ సుమారు మొత్తంగా 24 లక్షలు రూపాయలు ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి మహేశ్వర రెడ్డి వెల్లడించారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు జిల్లాలో మొత్తంగా 618 ఫోన్లు (Rs 79,00,000/-లక్షల) రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరిగినది అని పేర్కొన్నారు.మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు https://www.ceir.gov.in in అనే పబ్లిక్ వెబ్ సైట్ లో పిర్యాదు చేయవలెను అని , సంబంధిత పోలీసు సమాచారాన్ని అందించాలన్నారు.మొబైల్స్ వాడే వారు తప్పనిసరిగా ఫోన్లుకు సెక్యూరిటీ లాక్ ఉపయోగించాలని,వ్యక్తిగత, విలువైన సమాచారాన్ని మొబైల్స్ లో ఉంచకుండా జాగ్రత్త వహించాలని ఎస్పీ గారు సూచించారు.
*బాధితులు స్పందన*:- అతి తక్కువ కాలంలోనే పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ చేసి తమకు అందచేయడంతో బాధితులు సంతోషం వ్యక్తపరచి, జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
 పోగొట్టుకున్న దూర ప్రాంతాల్లో ఉన్న ఫోన్లుతో పాటు,అతి విలువైన మొబైల్ ఫోన్లు అతి తక్కువ కాలంలోనే చేదించడంలో ప్రతిభ కనబరిచిన సైబర్ సెల్ సీఐ టి. శ్రీను,సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు .

ఈ పత్రిక సమావేశంలో ఎస్బి సీఐ ఇమ్మానియల్ రాజు, సైబర్ సెల్ సీఐ టి. శ్రీను, సైబర్ సెల్ సిబ్బంది ఉన్నారు.

Post a Comment

0 Comments