శ్రీకాకుళం అక్టోబరు 26.దీపావళి పండుగ నేపథ్యంలో ఏటువంటి బాణసంచా ప్రేలుళ్ళు జరగకుండా, ప్రశాంతంగా దీపావళి పండుగ జరుపుకోవాలని, ఈ క్రమంలో అన్నీ ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు తెలిపారు.శనివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో దీపావళి పండుగ సందర్భంగా వ్యాపారస్తులు బాణాసంచా, మందు గుండు సామాగ్రి క్రయవిక్రయాలు జరిగే క్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన మాట్లాడారు..ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ - బాణసంచా నిల్వలు, తయారీ, విక్రయాలు జరిపే వారు సంబంధిత అన్ని విభాగాల అనుమతులు తప్పనిసరిగా పొందాలని పేర్కొన్నారు.బాణసంచా నిల్వలు, విక్రయాలు అనుమతులు ఉన్న గోడౌన్లు,షావులు వద్ద భద్రత ప్రమాణాలు, ఇసుక , ఫైర్ ఇంజన్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.బాణాసంచా విక్రయాలు దుకాణాలు ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలని,దుకాణానికి మధ్య 5 నుంచి 10 అడుగల మధ్య దూరం వ్యవధి ఉండేటట్లు చూసుకోవాలన్నారు.
ఎటువంటి అనుమతులు లేకుండా బాణసంచా విక్రయాలు, నిల్వలు, తయారీ చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.పరిమితికి మించి మందుగుండు సామాగ్రి నిల్వ లేకుండా చూడాలని, అటువంటి అక్రమ నిల్వ మందుగుండు సామాగ్రి కలిగినట్లయితే అట్టివారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
0 Comments