శ్రీకాకుళం అక్టోబరు 28. పోలీసు సిబ్బంది చేసిన రక్తదానం అత్యవసర పరిస్థితులు వేరే వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుందని, రక్తదాతలే ప్రాణదాతలు అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. అమరవీరుల స్మారక ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా ఉచిత వైద్య శిబిరం, అదేవిధంగా రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వీపనల్ దినకర్ పుండకర్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరై రక్తదాన శిబిరాలను జిల్లా కలెక్టర్,జాయింట్ కలెక్టర్ ప్రారంభించగా, మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ క్రమంలో రక్తదానం చేసిన పోలీస్ సిబ్బందికి బ్లడ్ డొనేషన్ ధ్రువీకరణ పత్రాలతో పాటు, రెడ్ క్రాస్ పతకాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసి చేతుల మీదుగా అందజేసారు. పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై దృష్టి సారించాలని ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. సిబ్బంది కొరకు మెడికవర్ హాస్పిటల్ సౌజన్యతో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో అక్టోబర్ 21 తేదీ నుంచి జరుగుతున్న అమరవీరుల స్మారక ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది కొరకు మెగా ఉచిత వైద్య శిబిరం, ఇందులో భాగంగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరిగిందని, ఇదొక చాల మంచి కార్యక్రమమన్నారు. రక్త దానం వలన అత్యవసర పరిస్థితులులో ఇంకొకరి ప్రాణాలు నిలబెట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కావున పోలీస్ సిబ్బందితో పాటు యువత, విద్యార్థులు ప్రజలు ఇలాంటి కార్యక్రమంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఒకసారి రక్తదానం చేసినట్టు ధ్రువీకరణ పత్రం పొందినట్లయితే అత్యవసర సమయంలో ఆయా సర్టిఫికెట్ ఆధారంగా రక్త నిల్వకేంద్రం నుంచి రక్తాన్ని అవసరం మేరకు అందజేస్తారని తెలిపారు. అమరవీరుల స్మారక ఉత్సవాలు ఈనెల 31వ తేదీ వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఇందులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంగా ఎస్పీ కార్యాలయంలో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని, గవర్నమెంట్ హాస్పిటల్, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా టెక్కలి, కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలో ఈనెల 29, 30 తేదీల్లో ఈ వైద్య శిబిరాలు,రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అమరవీరుల స్మారక ఉత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు సైబర్ నేరాలు, యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రస్తుత కాలంలో జరుగుతున్న సైబర్ నేరాలు గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అనధికార వ్యక్తులు, సంస్థలకు వ్యక్తిగతమైన వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు తెలపరాదని జిల్లా కలెక్టర్ సూచించారు.మాదక ద్రవ్యాలు వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావులు గురించి పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మహిళా పోలీసుకు కూడా పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకొని, రక్తదానం కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం సబ్ డివిజన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద,ఎల్ .శేషాద్రి, సీఐలు అవతారం, ఉమామహేశ్వరరావు,సత్యనారాయణ, సూర్య నారాయణ, రెడ్ క్రాస్ చైర్మన్ బి జగన్నాథం ప్రతినిధులు చైతన్య కుమార్, మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డా .సూర్య ప్రకాష్ ,రంగనాథ్, శ్రీనివాస్, మురళీ కృష్ణ, రిమ్స్ హాస్పిటల్ వైద్య అధికారులు, సబ్ ఇన్స్పెక్టర్, ఇతర పోలీసు అధికారులు,సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments