ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

త్వరితగతిన అర్జీలను పరిష్కరించాలి

శ్రీకాకుళం, అక్టోబర్ 28: ప్రజలు సంతృప్తి చెందేలా, త్వరితగతిన అర్జీలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా రెవిన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర రావు అన్నారు.

సోమవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) మీకోసం కార్యక్రమం జిల్లా రెవిన్యూ అధికారి అధ్యక్షతన జరిగింది. "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి 142 అర్జీలను స్వీకరించిన జిల్లా రెవిన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర రావుతో పాటు జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజు, ఉప కలెక్టర్ అప్పారావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు, సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్ మెంట్ ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌జ‌ల సంక్షేమం కోసం అమ‌లుచేస్తున్న వివిధ సంక్షేమ ప‌థ‌కాలు, రెవెన్యూ, పౌర సర‌ఫ‌రాల సేవ‌లు, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి అర్జీదారులు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి వారికి అర్జీలు సమర్పించారు.

కార్యక్రమంలో 15 మందికి కారుణ్య నియామకాలలో భాగంగా నియామక పత్రాలు అందజేశారు. అలాగే ఆర్.టి.సి లో విధులు నిర్వహిస్తు మరణించిన వారి కుటుంబ సభ్యులకు 7 గురికి, సచివాలయంలో విధులు నిర్వహిస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కరికి కారుణ్య నియామక పత్రాలు జిల్లా రెవిన్యూ అధికారి అందజేసి మాట్లాడుతూ అంకితం భావంతో విధులు నిర్వహించాలని హితావు పలికారు.

మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డా. బి మీనాక్షి, డిసిహెచ్ఎస్ డా. కళ్యాణ్ బాబు, డ్వామా పిడి సుధాకర్, ఐసిడిఎస్ పిడి శాంతిశ్రీ, జిల్లా ఉద్యాన అధికారి ఆర్ వరప్రసాద్, డిఆర్డిఏ, విద్యాశాఖ, విద్యుత్తు, ల్యాండ్ సర్వే, పోలీసు వివిధ శాఖల ద్వితీయ శ్రేణి అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments