ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

నవంబరు నుంచి నైపుణ్య గణన.జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం, అక్టోబర్ 27 : నవంబర్ మొదటి వారం నుండి జిల్లాలో నైపుణ్య గణన (స్కిల్ సెన్సెస్)కు శ్రీకారం చుడుతున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. నైపుణ్య గణన దేశంలోనే తొలి సారి మన రాష్ట్రంలో చేయబోతున్న ఒక గొప్ప ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 29వ తేదీన జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు, దీని కోసం మాస్టర్ ట్రైనర్ల ఎంపిక ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. పూర్తి స్థాయి శిక్షణ అనంతరం వారంతా మండల, మున్సిపాలిటీ స్థాయిలలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో మండల స్టాయిలో వున్న  సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇస్తారని, సంబంధిత వివరాలు *నైపుణ్యం* అనే అప్లికేషన్ (యాప్) ద్వారా సేకరిస్తారన్నారు. పరిశ్రమల అవసరాలు మానవ వనరుల వివరాలు బేరిజు వేసుకొని తగిన ప్రణాళికలు రూపొందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లాలో వున్న 15 నుండి 59 వయసు మధ్య వున్న నైపుణ్యం గల వ్యక్తుల వివరాలు సేకరించి తద్వారా జిల్లాలోని  నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఈ గణన పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి, జిల్లా ఉపాది అధికారిని నోడల్ అధికారులుగా నియమించామని, సచివాలయ సిబ్బందిని ఇందులో భాగస్వాములుగా చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments