ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

టీడీపీ గుండాల దాడిని ఖండిస్తున్నాం: వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్

నరసన్నపేట, అక్టోబర్ 27 ; తమపై కత్తి దాడి జరిగిందని రక్తమోడుతూ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వస్తే తిరిగి వాళ్లతోనే పోలీసులు సాక్షిగా పోలీస్ స్టేషన్లోనే దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ చెప్పారు. తమ కార్యకర్తలపై పోలీస్ స్టేషన్ సాక్షిగా టిడిపి గుండాలు చేసిన దాడిని రెడ్ బుక్ రాజ్యాంగం కాదని చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. దాడి చేస్తున్న నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, వారిపై కఠిన చర్యలకు పూనుకోకపోతే శాంతిభద్రతల నిర్వహణ పట్ల సామాన్యుడికి మీరు ఏం సమాధానం చెబుతారని పోలీసులను ప్రశ్నించారు. తమ కార్యకర్తల శాంతి, సహనం కోల్పోయినట్లు చేయవద్దని అలా చేస్తే తదనంతర పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి అంటూ తీవ్రంగా ఆక్షేపించారు. గాయపడ్డ బాధిత కుటుంబాల్ని పరామర్శిస్తామని, వారికి న్యాయం జరగకపోతే, అవసరమైతే పలాసలో మహా ధర్నాకు పిలుపునిస్తామని కృష్ణ దాస్ హెచ్చరించారు.

Post a Comment

0 Comments