ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఆర్డీవో గా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరణ

శ్రీకాకుళం, అక్టోబర్ 23 ; జిల్లా రెవిన్యూ అధికారిగా మారెళ్ళ వెంకటేశ్వరరావు సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.
వెంకటేశ్వరరావు 2014 - 19 మధ్య టెక్కలి ఆర్డిఓ గా పనిచేసి, బదిలీపై రంపచోడవరంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేశారు. గతంలో పలాస, ఇచ్చాపురం, పోలాకి మండలాలలో వివిధ స్థాయిలలో
  పనిచేశారు. డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి సాధించిన తర్వాత ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ గా, కే ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా కూడా శ్రీకాకుళం జిల్లాలో పనిచేశారు. జిల్లారెవిన్యూ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలు ఉద్యోగులు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు.

Post a Comment

0 Comments