*సుమారు 200 పైగా దళిత కుటుంబాలు ఉన్నా సరే వారికి స్మశాన రహదారి కరువు*
*పాలకులకు ఓట్లు అవసరం వచ్చినప్పుడు గుర్తున్న ప్రజలు ఇప్పుడెందుకు గుర్తుకు రావటం లేదు???*
*ప్రజల ఓట్లతో గద్దెక్కిన పాలకులకే లేని బాధ్యతలు అధికారులుకు ఉంటాయా?*
*అదీ లేదూ..???*
*ఇంకెప్పుడు తీరునో ఈ పారాపురం గ్రామ దళిత వాడల స్మశాన వాటికకు రహదారి కొరత...????*
కొత్తూరు మండలం :
పారాపురం గ్రామం :
ఒకప్పుడు రాష్ట్ర స్థాయిలోనే కాదు.. దేశ స్థాయిలో కూడా ఆ గ్రామానికి ఒక గుర్తింపు ఉన్న గ్రామం పారాపురం. అలాంటి పేరున్న పారాపురం గ్రామంలో ఇప్పుడు సుమారు 200 కుటుంబాలు పైగా ఉన్న దళితవాడలలో స్మశానానికి రహదారి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి బాధలు వర్ణనాతీతం. అధికారులు మరియు పాలకుల నిర్లక్ష్యానికి ప్రతీక ఈ దళిత వాడల స్మశాన సమస్య.
పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలకేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న పారాపురం గ్రామంలో దళితులు స్మశానవాటికకు రహదారి సమస్యను పాలకులు మరియు ప్రభుత్వం పరిష్కారం చేయాలని, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షుడు సిర్ల.ప్రసాద్ దళిత నాయకులు కింజరాపు. సింహచలం,గర్బాకరామారావు,కొర్రాయి రవి, యందవ రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈరోజు కొత్తూరు మండలం పారాపురం అంబేద్కర్ విగ్రహం ఎదుట జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ చాలా కాలం తరబడి దళితులు సమస్యలు పెండింగులో ఉన్నాయని చనిపోయిన వ్యక్తి దహనసంస్కారాలు కోసం స్మశానవాటికకు తీసుకు వెళ్ళటానికి నేటికీ రహధారి మార్గం లేదని, అనేక పర్యాయాలు ప్రజా ప్రతినిధులు, అధికారులుకు తెలియజేసినా సరే నేటికీ స్మశాన స్థలానికి వెళ్ళటానికి రహదారి సమస్యను పరిష్కారం కాలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పారాపురం గ్రామంలో దళితులు దీర్ఘకాలిక సమస్యగా ఉన్న స్మశాన వాటికకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని లేకపోతే పోరుబాట పడతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పారాపురం గ్రామ దళితులు గోపి,సింహచలం,శంకర్ రామారావు,రామకృష్ణ శ్రీను,రమణ,తదితరులు పాల్గొన్నారు.
0 Comments