శ్రీకాకుళం: ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర గవర్నర్ మంజీర జిలాని సూచనల మేరకు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారి సహకారంతో శ్రీకాకుళం ఇండియన్ రెడ్ క్రాస్ సోసిటీ పరిపాలన విభాగంలో ఉచిత యోగ శిక్షణా తరగతులను ప్రారంభించామని రెడ్ క్రాస్ కార్యదర్శి బలివాడ.మల్లేశ్వర రావు శుక్రవారం అన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్ మోహన్ రావు మాట్లాడుతూ యోగ గురువు రామారావు పర్యవేక్షణలో, యోగ శిక్షకురాలు ఎం.గాయత్రీ తరగతులను నిర్వహిస్తారని, ఈ రోజు మహిళల యోగ తరగతులు ప్రారంభించగా, అతి త్వరలో పురుషుల యోగ తరగతులను సైతం నిర్వహిస్తామన్నారు. ఆరోగ్యమే మహాబాగ్యమని, యోగాతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఉచిత యోగ కొరకు యోగ శిక్షకురాలు ఎం.గాయత్రీ చరవాణిని (9493043999) సంప్రదించాలన్నారు. యోగ గురువు రామ రావు మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్ మోహన్ రావు గత రెండు సంవత్సరాలనుండి యోగ తరగతులను ప్రారంబిద్దామని అనుకున్నారని, కొన్ని కారణాల వలన కార్యరూపం దాల్చలేదన్నారు. ఈ రోజు వారి సహకారంతోనే ఉచిత యోగ తరగతులను ప్రారంభించటం ఆనందదాయకమన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యానికి మించిన సంపదలేదన్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కోశాధికారి కనుగుల.దుర్గ శ్రీనివాస్,వైకుంఠ రావు, బి.సతీష్, బెజ్జిపురం యూత్ క్లబ్ ప్రసాద్ రావు, స్వీప్ రమణమూర్తి, కళ్యాణ్, నరసింగ రావు, పెంకీ.చైతన్య, గొలివి.రమణ, గుణాకర్ రావు, చిన్మయ రావు, సుజాత, నంది ఉమా శంకర్, అయేషా బేగం, యోగ నేర్చుకోవటానికి వచ్చిన మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments