ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

దళితులకి రాజ్యాధికారాన్ని దూరం చేసేందుకే ఎస్సీ వర్గీకరణ:

*దళితులకి రాజ్యాధికారాన్ని దూరం చేసేందుకే ఎస్సీ వర్గీకరణ*
- మాలలు మేల్కొనకపోతే నష్టపోతాం
- హక్కుల సాధన కోసం కార్యోణ్ముకులవుదాం
- పలాస సభను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలి
- విలేకరుల సమావేశంలో ఎస్.సి,ఎస్.టి జెఎసి నాయకులు కళ్లేపల్లి రామ్ గోపాల్ ,డా కంఠ వేణు,తైక్వాండో శ్రీను

శ్రీకాకుళం: దళితులకు రాజ్యాధికారాన్ని దూరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణను తెరపైకి తెచ్చాయని ఎస్.సి,ఎస్.టి జెఎసి నాయకులు కళ్లేపల్లి రామ్ గోపాల్ ,డా కంఠ వేణు,తైక్వాండో శ్రీను
 విమర్శించారు. మాలలంతా ఐక్యంగా కుట్రలను ఎదుర్కొవాలని అన్నారు. శ్రీకాకుళంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హక్కులను సాధించుకోవడం కోసం మాలలందరు కార్యోణుకులు కావాల్సిన సమయం ఆసన్నమైందన్నాఉ. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఎస్ .సి రిజర్వేషన్ల పరిరక్షణ,క్రిమిలేయర్ కి వ్యతిరేకంగా రాజ్యంగ పరిరక్షణలో భాగంగా హక్కుల సాధన కోసం ఈ నెల 27న పలాసలో అవగాహన సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. పలాస డివిజన్ కి చెందిన ఎస్.సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆద్వర్యంలో రైల్వే ఇనిస్టిట్యూట్ వద్ద నిర్వహిస్తున్న ఈ సదస్సుకి మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షకుమార్ , హైదరాబాద్ కి చెందిన రిటైర్డ్ ఐడిఏఎస్ పి.ఎస్.ఎన్.మూర్తి,విశాఖ ఆంధ్రా యూనివర్శిటీకి చెందిన ప్రోఫెసర్ జాన్ లతో పాటు అనేక మంది మేధావులు హాజరవుతున్నారన్నారు. జనాభాలో ఐక్యంగా ఉన్న 25 శాతం మంది మధ్య వర్గీకరణ చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని పాలకులు చూస్తున్నారని ధ్వజమెత్తారు. వర్గీకరణ మాటున క్రిమీలేయర్‌ కుట్ర జరుగుతున్నదన్నారు. దీని వలన ఎస్సీ, ఎస్టీలలోని అన్ని కులాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. మనువాదుల కుట్రను ఎదుర్కొనేందుకు మాలలు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఆర్టికల్‌ 341 ప్రకారం ఏదైనా ఒక కులాన్ని షెడ్యుల్‌ కులాల జాబితాలో చేర్చాలన్నా లేదా తీసివేయాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికా రం ఉందన్నారు. రిజర్వేషన్‌ తగ్గించే అధికారం పార్లమెంటుకు లేదన్నారు. ఆర్టికల్‌ 442 ప్రకారం షెడ్యుల్‌ట్రైబుల్‌ (ఎస్టీ) జాబితాలో చేర్చాలన్నా లేదా తీసివేయాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంద న్నారు. రాష్ట్రంలో ఏదైనా ఒక కులాన్ని షెడ్యుల్‌క్యాస్ట్‌, షెడ్యుల్‌ట్రైబులో కలపాలంటే నోటిఫైచేసి పార్లమెంటు పంపిస్తే అక్కడి నుంచి రాష్ట్రపతికి పంపించాలన్నారు. ఎస్సీలను వర్గీకరించే అధికారం రాష్ట్రపతికి లేదన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఎస్టీల గురించి అడగకపోయినా ఎస్సీ, ఎస్టీలకు క్రిమిలేయర్‌ వర్తిస్తుందని పేర్కొనడం దారుణమన్నారు. అస్పృశ్యత ఆధారంగా ఎస్పీలకు రిజర్వేషన్‌ కల్పించామని, నేడు ఆ రిజర్వేషన్లు ఎత్తివేయడానికి కుట్ర జరుగుతుందన్నారు. మాలలు అందరూ కూడా సంఘటితంగా హక్కుల కోసం పోరాడాలన్నారు. ఈ సదస్సుకి మాల మేధావులు,విద్యావంతులు,ఉద్యోగులు,ఉపాధ్యాయులు,ప్రజాప్రతినిధిలకు,మహిళలకి,ప్రజాస్వామ్య పరిరక్షణకి పాటుపడిన వారందరూ హాజరుకావాలని వారు కోరారు.

Post a Comment

0 Comments