ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సోమవారం ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా స్వామి వారిని దర్శించుకొని ,ప్రత్యేక పూజలు అనంతరం పాలకమండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేసి సభ్యులకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ పాలకమండలి సభ్యులు నిరంతరం దేవస్థానం అభివృద్ధికి తోడ్పడుతూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని,వాటికి సంబంధించిన సహాయ సహకారాలు నా నుండి ఎల్లవేళలా పాలకమండలికి ఉంటాయని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, పిఎసిఎస్ డైరెక్టర్లు, వంశధార డిస్ట్రిబ్యూటరి కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు వార్డు సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు ,పాలకమండ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments