ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఇంటి వద్దకే మట్టి వినాయక విగ్రహాలు.పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కరుణ శ్రీ

శ్రీకాకుళం,ఆగస్టు,25: ఇంటి వద్దకే మట్టి వినాయక విగ్రహాలను అందిస్తున్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కరుణ శ్రీ సోమవారం తెలిపారు. వినూత్న ఆలోచనతో మట్టి వినాయక ప్రతిమలను ఇంటి వద్దకే సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ ఏడాది పంపిణీ చేసినట్లు ప్రకృతి ప్రేమికులు అందరూ వినాయకుని మట్టి ప్రతిమలను వితరణ చేస్తున్నారు. అందుకు భిన్నంగా జిల్లాలో కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం శ్రీకాకుళం వారు కొత్తగా అలోచించి సాంకేతికతను వినియోగించి మట్టి వినాయక ప్రతిమలను ఇంటికే తెచ్చి ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోడానికి క్యూఆర్ కోడ్ ను ఇచ్చి ప్రజలను తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. ఒక్క రోజులోనే శ్రీకాకుళం పట్టణం నుండి మూడు వేలు మంది తమ తమ వివరాలను నమోదు చేసుకోగా, ఆదివారం ఒక్కరోజు వెయ్యి విగ్రహాలు, క్లాత్ తో కూడిన సంచి, వ్రతకథ పుస్తకాన్ని ఇంటి వద్దకే సరఫరా చేశారు. డెలివరీ అందుకున్న ప్రజలు ఈ కొత్త కార్యక్రమంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఇంటి వద్దకే మట్టి వినాయక విగ్రహం అందడం వలన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, రసాయన రంగులు కలిగిన విగ్రహాలు కొనాల్సిన అవసరం లేకుండా పర్యావరణ పరిరక్షణకు సహకరించగలిగామని అన్నారు. ఈ వినూత్న ఆలోచనకు ప్రజలు అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో చేపట్టాలని ప్రజలు కోరుతున్నట్లు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments