ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

అర్జీలు పరిష్కారం వేగవంతం చేయాలి.జిల్లా కలెక్టర్

శ్రీకాకుళం,ఆగస్టు,25: అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. విభిన్న ప్రతిభా వంతుల నుండి కలెక్టర్ స్వయంగా బయటకు వెళ్లి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను కలెక్టర్ కు వివరించారు. స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ 9, గ్రామీణాభివృద్ధి శాఖ 3, పంచాయతీ రాజ్ 5, వ్యవసాయ శాఖ 5, ఎపిఈపీడిసియల్ 4, సర్వే అండ్ లాండ్ రికార్డులు 3, మున్సిపల్ కార్పొరేషన్ - 1, జిల్లా పంచాయతీ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ 3, జిల్లా విద్యాశాఖ 2, ఆర్ అండ్ బి - 1, హోం - 1, సమగ్ర శిక్ష - 1, మెడికల్ ఎడ్యుకేషన్ - 1మొదలగు  సమస్యల పై 120 అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డిఎ పిడి కిరణ్ కుమార్, జడ్పీ సీఈవో ఎల్ఎన్ వి శ్రీధర్ రాజ ఉన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments